ఇక కార్లలోనూ డాల్బీ అట్మాస్ సౌండ్... గూగుల్ లేటెస్ట్ అప్ డేట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక కార్లలోనూ డాల్బీ అట్మాస్ సౌండ్... గూగుల్ లేటెస్ట్ అప్ డేట్!

Google Adds Dolby Atmos Support to Android Auto for Enhanced Car Audio
  • ఆండ్రాయిడ్ ఆటోకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ప్రకటించిన గూగుల్
  • ఎంపిక చేసిన కార్లలో ఫుల్ హెచ్‌డీ వీడియో స్ట్రీమింగ్ సౌకర్యం
  • గూగుల్ మ్యాప్స్‌లో 3డీలో భవనాలు, రోడ్లు చూపించే ఇమ్మర్సివ్ నావిగేషన్
  • సరికొత్త డిజైన్‌తో మారిన ఆండ్రాయిడ్ ఆటో ఇంటర్‌ఫేస్
  • కార్ ఇన్ఫోటైన్‌మెంట్‌పై జెమినీ ఏఐ ఫీచర్ల వినియోగం
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్, తమ ఆండ్రాయిడ్ ఆటో ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త ఫీచర్‌ను జోడించింది. వినియోగదారులకు కార్లలో మరింత నాణ్యమైన, స్పష్టమైన ఆడియో అనుభూతిని అందించేందుకు డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. సపోర్ట్ ఉన్న యాప్‌లు, కార్లలో ఈ ఫీచర్ లభించనుంది. తొలి దశలో బీఎండబ్ల్యూ, మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్, రెనో, స్కోడా, టాటా, వోల్వో వంటి కార్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

ఆడియోతో పాటు వీడియో నాణ్యతపై కూడా గూగుల్ దృష్టి సారించింది. ఆండ్రాయిడ్ ఆటోలో తొలిసారిగా ఫుల్ హెచ్‌డీ (1080పి) 60ఎఫ్‌పీఎస్ వీడియో స్ట్రీమింగ్‌కు సపోర్ట్ ప్రకటించింది. దీంతో పాటు ఆండ్రాయిడ్ ఆటో యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా 'మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్' డిజైన్‌తో పూర్తిగా మార్చింది. దీనివల్ల కొత్త ఫాంట్లు, ఆకర్షణీయమైన యానిమేషన్లు, వాల్‌పేపర్లు లభిస్తాయి.

అంతేకాదు, గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా గూగుల్ మ్యాప్స్‌కు అతిపెద్ద అప్‌డేట్ వచ్చింది. 'ఇమ్మర్సివ్ నావిగేషన్' పేరుతో 3డీలో భవనాలు, ఓవర్‌పాస్‌లు, రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి వివరాలను ఇది స్పష్టంగా చూపిస్తుంది. 

అలాగే, ఫోన్‌లోని జెమినీ ఏఐ ఫీచర్లను నేరుగా కార్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై ఉపయోగించుకునే సౌకర్యం కూడా కల్పించారు. గూగుల్ బిల్ట్-ఇన్ ఉన్న కార్లలో జూమ్ వంటి మీటింగ్ యాప్‌లకు కూడా సపోర్ట్ లభించనుంది. ఈ కొత్త ఫీచర్లన్నీ సపోర్ట్ చేసే కార్లలో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
Advertisement
Google
Android Auto
Dolby Atmos
car audio
car infotainment
Google Maps
immersive navigation
car technology
full HD video
Gemini AI

More Telugu News