రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’... ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఏపీలో నవ శకం
- రాయలసీమను డి హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వ భారీ అడుగులు
- పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్, డిఫెన్స్ రంగాల్లో మరో 12 కంపెనీల ప్రాజెక్టులకు శ్రీకారం
- వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు
ఒకప్పుడు రత్నాలకు, ఆ తర్వాత ఉద్యాన పంటలకు నెలవైన రాయలసీమ, ఇప్పుడు దేశ రక్షణ రంగంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతోంది. స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి కేంద్రంగా నిలవనుంది. ‘రతనాల సీమ’గా చరిత్రలో, ‘ఉద్యాన సీమ’గా వర్తమానంలో నిలిచిన ఈ ప్రాంతం, భవిష్యత్తులో ‘రక్షణ సీమ’గా సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో రక్షణ, డ్రోన్ రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రాయలసీమ వేదిక కానుంది. ఇందులో భాగంగా, శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏఎంసీఏ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగనుంది
పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు భూమిపూజ
దేశ రక్షణ వ్యవస్థలో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు పుట్టపర్తిలో పునాది రాయి పడనుంది. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్‌డీఓ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. సుమారు రూ.15,803 కోట్ల భారీ బడ్జెట్‌తో, 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా, భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేస్తారు. స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్, సూపర్ క్రూయిజ్ వంటి అత్యాధునిక సామర్థ్యాలు ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత. కేవలం తయారీనే కాకుండా, వాటి టెస్టింగ్ కూడా పుట్టపర్తిలోనే చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 7,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా మరో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని, దీనికోసం ప్రభుత్వం మరో 400 ఎకరాలు కేటాయించింది.