యుద్ధ విమానాల పరిశ్రమకు శంకుస్థాపన.. చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ షెడ్యూల్ ఇదిగో!
- సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల పరిశ్రమ
- శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్
- ఏపీని డిఫెన్స్ హబ్ చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఏపీ ప్రభుత్వం
సత్యసాయి జిల్లా పారిశ్రామిక చిత్రపటంలో సరికొత్త చరిత్ర లిఖించబడబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంయుక్తంగా రేపు (శుక్రవారం) పుట్టపర్తి వేదికగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా మార్గం సుగమం కానుంది.