శర్వానంద్ 'భోగి'.. మందారంగా డింపుల్ హయతి ఫస్ట్ లుక్
- 'మందారం' అనే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న డింపుల్
- 1960ల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం
- హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో కొనసాగుతున్న షూటింగ్
- రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె 'మందారం' అనే పాత్రలో నటిస్తోంది.
"ప్రపంచం కోరుకున్న అందం.. కానీ ఆ ఆత్మను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు" అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎర్ర చీరలో డింపుల్ హయతి ఎంతో పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా కనిపిస్తోంది. చేతిలో విసనకర్ర పట్టుకుని తీక్షణంగా చూస్తున్న ఆమె లుక్, 1960ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఆమె పాత్ర చాలా శక్తిమంతంగా, ఎవరినీ లెక్కచేయని తత్వంతో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇటీవలే ఈ సినిమా నుంచి మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆమె 'కందుల సులోచనా రాణి' అనే పాత్రలో మోదుగ ఆకులతో బుట్టలు అల్లే పల్లెటూరి యువతిగా కనిపించింది. ఈ చిత్రంలో శర్వానంద్ 'గంగ' అనే పాత్రలో నటిస్తున్నాడు.
1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 28న రక్షాబంధన్ కానుకగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.