ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్!

Axar Patel Comments After Winning Toss Against Punjab Kings
  • పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
  • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ అక్షర్ పటేల్
  • ఢిల్లీ జట్టులో ఐదు కీలక మార్పులు
  • పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయనున్న బెన్ డ్వార్షియస్
ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

టాస్ గెలిచిన అనంతరం అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమకు టాస్ గెలవడం మాత్రమే కలిసొస్తోందని సరదాగా వ్యాఖ్యానించాడు. ధర్మశాలలో పిచ్ ఫ్రెష్‌గా ఉందని, ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉన్నందున ఛేజింగ్‌కు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఏకంగా ఐదు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ జట్టు 7 మ్యాచ్ లలో ఓటమిపాలైంది.

మరోవైపు, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. పిచ్ గురించి ఇప్పుడే అంచనా వేయలేమని, తమ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి సహజమైన ఆటతీరును ప్రదర్శించాలని సూచించాడు. స్వల్ప గాయంతో లాకీ ఫెర్గూసన్ దూరం కావడంతో, అతని స్థానంలో బెన్ డ్వార్షియస్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడని ప్రకటించాడు.

ఇరు జట్ల వివరాలు:

ఢిల్లీ క్యాపిటల్స్ 
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, అకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి.

పంజాబ్ కింగ్స్ 
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ డ్వార్షియస్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: పాతుమ్ నిస్సంక, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, త్రిపురాన విజయ్.

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: హర్‌ప్రీత్ బ్రార్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే.


Go Back to Shorts
Axar Patel
Delhi Capitals
Punjab Kings
IPL 2024
Shreyas Iyer
Dharamshala
Himachal Pradesh Cricket Association Stadium
Cricket
Toss
Ben Dwarshuis

More Telugu News