విజయ్ పార్టీకి అందుకే మద్దతిచ్చాం: కాంగ్రెస్ పార్టీ ఎంపీ
- టీవీకే మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమన్న ఎంపీ
- స్థిరమైన ప్రభుత్వం, ఎన్డీయేను అధికారానికి దూరంగా ఉంచేందుకు మద్దతిచ్చామని వెల్లడి
- డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మరో ఎన్డీయే కూటమి అని విమర్శ
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇస్తున్నందుకు తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకే మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమని, అందుకే తాము ఆ పార్టీకి అండగా నిలిచామని అన్నారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం, ప్రజల తీర్పును గౌరవించేందుకు, దక్షిణాది రాష్ట్రంలో ఎన్డీయేను అధికారానికి దూరంగా ఉంచేందుకు టీవీకేకు మద్దతిచ్చామని తెలిపారు.
ఫలితాలు వెలువడిన రోజు రాహుల్ గాంధీ స్టాలిన్‌కు, మమతా బెనర్జీకి ఫోన్ చేశారని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ 100 స్థానాలలో ఓటు చోరీకి పాల్పడిందని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను, రాహుల్ గాంధీ కూడా సమర్థించారని గుర్తు చేశారు. కానీ ఎన్డీయేకు వ్యతిరేకంగా తమిళనాడులో టీవీకేకు మద్దతివ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
కానీ ఇప్పుడు మాత్రం డీఎంకే మీడియా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే బీజేపీ ఆశీస్సులతోనే తమపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవానికి తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మరో ఎన్డీయేగా చెప్పవచ్చని అన్నారు. వారి అభిప్రాయం మేరకు, ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి మేం సహకరించాలా అని ధ్వజమెత్తారు. టీవీకేకు అండగా నిలిచినందుకు తాము ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.