వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

  • మహిళా స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు
  • రూ.10 లక్షల రుణానికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్న సీతక్క
  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,228 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు వెల్లడి
మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు ఇస్తున్న వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. స్వయం సహాయక బృందాలు తీసుకునే రూ.10 లక్షల రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

మహిళా స్వయం సహాయక బృందాలకు ఇచ్చే బ్యాంకు వార్షిక రుణ ప్రణాళికను ఈరోజు ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు రూ.25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు సీతక్క తెలిపారు.

మహిళా సంఘాల రుణాల వడ్డీ కోసం రూ.2,500 కోట్లు వ్యయం చేస్తామని వెల్లడించారు. 'మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి' అనే నినాదంతో ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. మహిళలు పేదరికం నుంచి బయటపడినప్పుడే అభివృద్ధి పరిపూర్ణమవుతుందని వ్యాఖ్యానించారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీతక్క తెలిపారు.

Seethakka
Telangana government
Women self help groups
Interest free loans
SHG loans
Bank loans

More Telugu News