ఇరాన్ సహకరించకుంటే మళ్లీ బాంబుదాడులు మొదలవుతాయి: ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ ముగిసిపోతుందన్న ట్రంప్
- ఇరాన్ సహా అందరికీ హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని వెల్లడి
- లేదంటే గతంలో కంటే భీకరస్థాయిలో బాంబు దాడులు ఉంటాయన్న ట్రంప్
ఒప్పందానికి ఇరాన్ సహకరిస్తే హర్మూజ్ జలసంధి తెరుచుకుని అంతా ప్రశాంతంగా ఉంటుందని, లేదంటే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకుంటే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ ముగిసిపోతుందని అన్నారు. అప్పుడు ఇరాన్ సహా అందరికీ హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని పేర్కొన్నారు.
ఇరాన్ నుంచి సహకారం లేకుంటే మునుపటి కంటే భీకరస్థాయిలో, మరింత తీవ్రతతో బాంబు దాడులు ఉంటాయని హెచ్చరించారు. యుద్ధం ముగింపు దిశగా ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
యుద్ధాన్ని ముగించేందుకు, మరింత వివరణాత్మక అణు చర్చల కోసం ప్రేమ్ వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు రెండు దేశాలు ఓ ఒప్పందానికి చేరువవుతున్నాయంటూ అమెరికా మీడియా సంస్థ ఒకటి తెలిపింది. అణు కార్యక్రమాల తాత్కాలిక నిషేధానికి ఇరాన్ ముందుకు రావడం, హర్మూజ్ జలసంధిలో ఆంక్షలు ఎత్తివేయడం, ఇరాన్‌కు చెందిన నిధుల విడుదలకు అమెరికా అంగీకరించడం వంటివి ఈ ఒప్పందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.