కళ్లముందే భార్య, కొడుకు జలసమాధి.. కుమార్తెను కాపాడుకున్న భర్త
- మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
- "సేవ్ మీ" అంటూ సోదరుడికి సోదరి చివరి వీడియో కాల్
- వాతావరణ హెచ్చరికలు ఉన్నా బోటు నడపడంపై తీవ్ర ఆరోపణలు
- భర్త, కుమార్తె ప్రాణాలతో బయటపడగా.. భార్య, కుమారుడు, అత్త మృత్యువాత
- ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, రూ.4 లక్షల పరిహారం
"నన్ను కాపాడండి.. నన్ను కాపాడండి".. ఆ మహిళ నుంచి సోదరుడికి చేరిన చివరి మాటలివి. ఆ తర్వాత ఫోన్ కట్ అయింది. ఆనందంగా సాగుతున్న విహారయాత్రలో ఒక్కసారిగా పెను విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నర్మదా నదిలో క్రూజ్ బోటు బోల్తా పడిన ఘటనలో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు జలసమాధి అయ్యారు. భర్త కళ్ల ముందే భార్య, కుమార్తె నీటమునిగారు. ఈ హృదయ విదారక ఘటన ఎందరినో కంటతడి పెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన మాసీ కుటుంబం జబల్‌పూర్‌లోని బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లింది. కార్యక్రమం ముగిశాక, గురువారం సరదాగా బర్గీ డ్యామ్‌లో బోటు షికారుకు బయలుదేరింది. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ నడిపే క్రూజ్ బోటులో సుమారు 40 మందితో కలిసి ప్రయాణం ప్రారంభించారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు మెరీనా (39) తన సోదరుడికి వీడియో కాల్ చేసి అక్కడి సుందర దృశ్యాలు చూపిస్తోంది.
అంతలోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడం, భారీ అలలు ఎగసిపడటంతో బోటు అదుపుతప్పి బోల్తా పడింది. బోటు కుదుపులకు లోనవడంతో మెరీనా "సేవ్ మీ.. సేవ్ మీ.." అంటూ ఆర్తనాదాలు పెడుతుండగానే కాల్ కట్ అయింది. ఈ దుర్ఘటనలో మెరీనా, ఆమె నాలుగేళ్ల కుమారుడు త్రిషాన్, ఆమె తల్లి మధుర్ మాసీ (62) మరణించారు. మెరీనా భర్త ప్రదీప్ ఈత వచ్చినవాడు కావడంతో తనను, తన 14 ఏళ్ల కుమార్తె సియాను కాపాడుకోగలిగారు. కానీ, కళ్ల ముందే భార్య, కుమారుడు, అత్త నీటిలో గల్లంతవడం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది.
వాతావరణ హెచ్చరికలు ఉన్నా అధికారులు, బోటు ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచకపోవడం వంటి కారణాల వల్లే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించినట్లు, 28 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించి, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.