తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల

  • 2025 అక్టోబర్ వరకు ఉన్న పెండింగ్ బకాయిలు క్లియర్ చేసిన ప్రభుత్వం
  • నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
  • భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. వారి బకాయిల కోసం వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేసింది. గత సంవత్సరం అక్టోబర్ వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను క్లియర్ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రూ.1000 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల, జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న అన్ని బకాయిలను ఒకేసారి విడుదల చేసింది.

ఈ బకాయిల విడుదలతో పాటు భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నెలా చేసే చెల్లింపుల పరిమితిని మరో రూ.1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనితో ఉద్యోగులకు సంబంధించిన క్లెయిమ్స్, బిల్లులు ఇకపై పెండింగ్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే వీలుంటుంది.

Retired employees pending funds released
Telangana Government released funds

More Telugu News