నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్, భువీ... 75 పరుగులకే ఢిల్లీ ఢమాల్
- ఆర్సీబీ పేసర్ల ధాటికి 16.3 ఓవర్లలోనే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్
- జోష్ హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో విధ్వంసం
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు నమోదు చేసిన ఢిల్లీ
- ఒంటరి పోరాటం చేసిన ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30)
ఢిల్లీ క్యాపిటల్స్ తో ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో సృష్టించిన విధ్వంసానికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కేవలం 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది.
ఈ ఇద్దరు పేసర్లు కలిసి తొలి నాలుగు ఓవర్లలోనే ఆరు వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. టెస్ట్ మ్యాచ్‌ను తలపించేలా బంతిని స్వింగ్ చేస్తూ, బౌన్స్‌తో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. హేజిల్‌వుడ్ కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ 5 పరుగులకే 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పోరెల్ (33 బంతుల్లో 30) మినహా మరే ఇతర బ్యాటర్ 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.
భువనేశ్వర్ కుమార్ వేసిన పదునైన ఇన్‌స్వింగింగ్ యార్కర్‌కు అరంగేట్ర ఆటగాడు సాహిల్ పరాఖ్ (0) క్లీన్ బౌల్డ్ కావడంతో ఢిల్లీ పతనం మొదలైంది. ఆ తర్వాత హేజిల్‌వుడ్ వరుస బంతుల్లో కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీలను ఔట్ చేసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బతీశాడు. కాసేపు నిలిచిన ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్‌ను సైతం భువనేశ్వర్ తన అద్భుతమైన స్వింగ్‌తో పెవిలియన్‌కు పంపాడు.
ఆ వెంటనే హేజిల్‌వుడ్ షార్ట్ బాల్‌కు నితీశ్ రాణా వెనుదిరగడంతో ఢిల్లీ 4 ఓవర్లలో 9 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్‌ప్లే ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 13 పరుగులు మాత్రమే చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది.
ఈ దశలో అభిషేక్ పోరెల్ (30), డేవిడ్ మిల్లర్ (19) కాసేపు ప్రతిఘటించారు. వీరిద్దరూ కలిసి 31 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, రసిఖ్ సలామ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి మిల్లర్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కైల్ జేమీసన్ ఒక సిక్సర్ బాది ఢిల్లీని ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు ప్రమాదం నుంచి గట్టెక్కించాడు. కానీ కృనాల్ పాండ్యా అతడిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. సుయాశ్ శర్మ.. కుల్దీప్ యాదవ్‌ను బౌల్డ్ చేయగా, చివర్లో హేజిల్‌వుడ్ అద్భుతమైన యార్కర్‌తో పోరెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఢిల్లీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.