కాంగ్రెస్ పార్టీలో చేరడం రిస్కీ పని: యువతి సమాధానంతో రాహుల్ గాంధీ నవ్వులు
- ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినులతో రాహుల్ గాంధీ ముచ్చట్లు
- యువతి సమాధానానికి సరదాగా నవ్విన రాహుల్ గాంధీ
- అవును.. నిజంగానే రిస్క్ అన్న రాహుల్ గాంధీ
మీ జీవితంలో మీరు చేసిన అత్యంత రిస్కీ పని ఏమిటి? అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించగా, ఓ విద్యార్థిని నుంచి ఊహించని సమాధానం వచ్చింది. దీనితో అక్కడ కొన్ని క్షణాలు నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఢిల్లీ యూనివర్సిటీ, గార్గీ కాలేజీలకు చెందిన విద్యార్థినులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఆ సమయంలో "మీరు చేసిన అత్యంత సాహసోపేతమైన పని ఏమిటి?" అని విద్యార్థినులను రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
అక్కడున్న వారిలో ఒక విద్యార్థిని స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్యంత సాహసోపేతమైనదని పేర్కొన్నారు. ఈ సమాధానంతో రాహుల్ గాంధీ కూడా నవ్వేశారు. "అవును, అది నిజంగా సాహసోపేతమైనదే" అంటూ బదులిచ్చారు. దీంతో రాహుల్ గాంధీతో పాటు విద్యార్థినులందరూ సరదాగా నవ్వారు. రాహుల్ గాంధీ యువ ఓటర్లతో మమేకవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాలేజీ విద్యార్థినులతో జరిగిన కార్యక్రమంలో ఈ సరదా సంభాషణ జరిగింది.