ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

  • ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
  • కోదండరాం, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ముస్లింల ఓట్ల కోసం తనకు మంత్రి పదవి ఇచ్చారనే వాదనలో వాస్తవం లేదన్న అజారుద్దీన్
ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీగా తనను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మంత్రి మండలికి, పీసీసీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని అన్నారు. రాజకీయాల్లో, జీవితంలో ఎత్తుపల్లాలు వస్తుంటాయని, అన్నింటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ముస్లింల ఓట్ల కోసం తనకు మంత్రి పదవి ఇచ్చారనే వాదనలో వాస్తవం లేదని అన్నారు.

Kodandaram
Telangana MLC
Mohammed Azharuddin
Gutta Sukhender Reddy
Revanth Reddy
Telangana Government

More Telugu News