అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన గవర్నర్... ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ సర్కారు!
- గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం
- మహ్మద్ అజారుద్దీన్, కోదండరాంలను నామినేట్ చేసిన గవర్నర్
- ఈ నెల 30లోగా ఎన్నిక కాకపోతే అజార్ మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం
- కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి నియామకాలు
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాంలను గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదివారం నామినేట్ చేశారు. ఈ నియామకాలు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. డి. రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 మే 27న ముగియడంతో ఏర్పడిన ఖాళీలను వీరితో భర్తీ చేశారు.
ఈ నియామకం ముఖ్యంగా మంత్రి అజారుద్దీన్‌కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30లోగా చట్టసభకు ఎన్నిక కావడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 19న గవర్నర్‌ను కలిసి ఈ నియామకాలకు ఆమోదం తెలపాలని కోరారు.
గత ఏడాది ఆగస్టులోనే అజారుద్దీన్, కోదండరాంల పేర్లను రాష్ట్ర కేబినెట్ గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే, గత ప్రభుత్వంలో నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఈ నియామకాలను సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వారి నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో సంప్రదింపులు జరపవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల సూచించడంతో ఈ నియామకాలకు మార్గం సుగమమైంది. తాజా నియామకాలు కోర్టు తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయి.