డీసీ పేసర్ ఎంగిడికి తీవ్రగాయం... స్పృహలో లేని స్థితిలో ఆసుపత్రికి తరలింపు!
- ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగిడికి తీవ్ర గాయం
- క్యాచ్ పట్టే ప్రయత్నంలో వెనక్కి పడటంతో తల నేలకు బలంగా తాకింది
- మైదానం నుంచి నేరుగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు
- ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), పంజాబ్ కింగ్స్ మధ్య శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డీసీ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడిని మైదానం నుంచే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్టేడియంలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది.
పంజాబ్ కింగ్స్ ఛేదనలో భాగంగా మూడో ఓవర్లో ఈ దుర్ఘటన జరిగింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య మిడ్-ఆఫ్ దిశగా షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఎంగిడి, క్యాచ్ అందుకునేందుకు వెనక్కి పరిగెత్తుతూ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో అదుపుతప్పి వెనక్కి పడిపోవడంతో అతని తల వెనుక భాగం నేలకు బలంగా తగిలింది.
ఎంగిడి నొప్పితో విలవిల్లాడుతుండడంతో, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే డీసీ ఫిజియో, వైద్య బృందం మైదానంలోకి పరుగెత్తుకొచ్చింది. దాదాపు 15 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. ఎంగిడి పరిస్థితి తీవ్రతను గమనించి మైదానంలోకి అంబులెన్స్ తీసుకువచ్చారు. మెడ కదల్చలేని స్థితిలో ఉండటంతో, వైద్య సిబ్బంది అతనికి నెక్ బ్రేస్ అమర్చి స్ట్రెచర్‌పై అంబులెన్స్‌లోకి తరలించారు.
ప్రస్తుతం ఎంగిడికి కరోల్ బాగ్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, అతడిని మైదానం నుంచి తరలించే సమయానికి స్పృహలో లేడని ఐఏఎన్ఎస్ వర్గాలు తెలిపాయి. రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నాయి. ఎంగిడి స్థానంలో విప్రజ్ నిగమ్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా డీసీ జట్టులోకి తీసుకున్నారు.