వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్
- అనంతబాబును నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధించిన కాకినాడ మొబైల్ కోర్టు
- రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్న పోలీసులు
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. సాక్షులను బెదిరించిన ఆరోపణలపై నిన్న అరెస్టయిన ఆయనకు ఈ ఉదయం కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ఈరోజు కాకినాడ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.