ఛత్తీస్‌గఢ్ కొండల్లో చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ప్రైవేట్ జెట్

Private jet crashes into hillside in Chhattisgarh
  • ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జష్‌పూర్ జిల్లాలో ప్రమాదం
  • పైలట్, కోపైలట్ మృతి
  • సంఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జష్‌పూర్ జిల్లా కొండల్లో సోమవారం ఒక ప్రైవేటు జెట్ విమానం చెట్టును ఢీకొట్టి కుప్పకూలింది. అటవీ ప్రాంతంలో ఒక చెట్టును ఢీకొనడంతో ఇది కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ చనిపోయారు. ఘటనాస్థలంలో మంటలు ఎగిసిపడటంతో పొగ దట్టంగా అలుముకుంది.

ఈ ప్రైవేటు జెట్ విమానంలో ఎంతమంది ప్రయాణించారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ జెట్‌లో ప్రయాణికులు ఉన్నారా లేదా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఉన్నతాధికారులు ఘటనస్థలానికి చేరుకున్నారు.
Advertisement
Private jet crashes in Chhattisgarh
pilot and co pilot killed

More Telugu News