పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు... మరో స్టాండప్ కమెడియన్ అరెస్ట్
- పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కలకలం
- మరో స్టాండప్ కమెడియన్ రఫీక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- బెయిల్‌పై విడుదలైన కమెడియన్ అనుదీప్ కటికాల
- వ్యక్తిగత విమర్శల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగిన ఇద్దరు స్టాండప్ కమెడియన్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనుదీప్ కటికల అనే కమెడియన్‌ను అరెస్ట్ చేయగా, తాజాగా విశాఖపట్నంకు చెందిన మరో కమెడియన్ రఫీక్ మొహమ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్యం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈ ఘటనలు తీవ్ర చర్చకు దారితీశాయి.
గత కొంతకాలంగా పవన్ వైవాహిక జీవితం, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌తో పాటు రామ్ చరణ్, ఉపాసన, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ కటికలను కాకినాడ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరువక ముందే రఫీక్ మొహమ్మద్ అనే కమెడియన్ గతంలో చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పవన్ ముగ్గురు భార్యల గురించి, ముఖ్యంగా ఆయన భార్య అన్నా లెజినోవా గురించి రఫీక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఈ వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని జనసేన నేత సాయన శివనారాయణ మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రాత్రి విశాఖపట్నంలోని రఫీక్ నివాసానికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
పవన్ కల్యాణ్ ఇప్పుడు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, రాష్ట్ర డిప్యూటీ సీఎంగా కీలక హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే రాజకీయ ప్రత్యర్థుల ప్రోద్బలంతోనే ఈ కమెడియన్లు వరుసగా దాడులకు దిగుతున్నారని కూటమి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.