చెఫ్ వికాస్ ఖన్నా: 'టైమ్ 100' జాబితాలో స్థానం వెనుక కన్నీటి ప్రయాణం!
- ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు 'టైమ్ 100' జాబితాలో చోటు
- ఈ స్థాయికి చేరడానికి ఆయన పడిన కష్టాలు ఎన్నో
- భారత్‌లో వ్యాపారం కూలిపోవడంతో అమెరికాకు పయనం
- న్యూయార్క్‌లో వీధుల్లో ఆహారం అమ్మి, రైల్వే స్టేషన్‌లో నిద్రించిన వైనం
- ఆయన ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఫ్యాన్స్ ప్రశంసలు
ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా తన జీవితంలో మరొక అద్భుతమైన మైలురాయిని అందుకున్నారు. 2026 సంవత్సరానికి గానూ 'టైమ్' మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ వార్త తెలియగానే న్యూయార్క్‌లోని 'బంగ్లో' రెస్టారెంట్‌కు అభినందనల వెల్లువ మొదలైంది. అయితే, ఈ విజయం వెనుక తాను పడిన కఠోర శ్రమను, అవమానాలను, ఒంటరితనాన్ని గుర్తుచేసుకుంటూ చెఫ్ వికాస్ ఖన్నా తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగమైన పోస్ట్ చేశారు.
అమృత్‌సర్ వీధుల నుంచి..
తన ప్రయాణం 1989లో అమృత్‌సర్‌లోని ఒక స్కూల్ వద్ద ఛోలే బటూరే అమ్ముకోవడంతో మొదలైందని వికాస్ ఖన్నా తెలిపారు. 1990లో తన ఇంటి వెనుక భాగంలోనే 'లారెన్స్ గార్డెన్ బాంక్వెట్' ప్రారంభించారు. అయితే, 1991లో తాను చెఫ్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు తన నానమ్మ తప్ప కుటుంబంలో దాదాపు అందరూ ఆ నిర్ణయాన్ని అవమానంగా భావించారని ఆయన గుర్తుచేసుకున్నారు.
"నేను ఎప్పుడూ చెప్పని ఎన్నో అవమానాలు, నన్ను మానసికంగా కుంగదీసిన క్షణాలు నా జీవితంలో ఉన్నాయి. 2000వ సంవత్సరంలో నా బాంక్వెట్ హాల్‌ను కూల్చివేసినప్పుడు, ఇక అంతా అయిపోయిందని దాదాపుగా ఓటమిని అంగీకరించాను. కానీ, బదులుగా అమెరికాకు వెళ్లి మళ్లీ కొత్తగా జీవితం ప్రారంభించాను" అని ఆయన వివరించారు.
న్యూయార్క్‌లో కఠిన పరీక్షలు
అమెరికా ప్రయాణం ఆయనకు పూలబాట కాలేదు. న్యూయార్క్‌లో మళ్లీ సున్నా నుంచి తన ప్రయాణం మొదలుపెట్టారు. ఇళ్లు శుభ్రం చేయడం, ట్రైబెకా వీధుల్లో ఆహారం అమ్మడం, గ్రాండ్ సెంట్రల్ స్టేషన్‌లో నిద్రించడం, నిరాశ్రయుల కేంద్రంలో తలదాచుకోవడం వంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. "రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు నన్ను 'కర్రీ బాయ్' అని పిలిచేవారు. అయినా నేను ముందుకు సాగుతూనే ఉన్నాను" అని తన ఆవేదనను పంచుకున్నారు.
విజయం, పతనం, పునరాగమనం
ఈ కఠోర శ్రమకు ఫలితంగా ఆయన 8 మిషెలిన్ స్టార్స్‌ను అందుకున్నారు. కానీ, ఆ తర్వాత మళ్లీ తనను తాను కోల్పోయానని, తిరిగి తన సోదరికి ఇచ్చిన మాట కోసం 'బంగ్లో' రెస్టారెంట్‌తో చివరిసారిగా మళ్లీ ప్రారంభించానని తెలిపారు. ఇప్పుడు టైమ్ 100 జాబితాలో చోటు దక్కించుకోవడంపై స్పందిస్తూ, "ఈ గౌరవాన్ని నేను ఇంకా జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రయాణం ఇంకా కొనసాగుతుంది" అని వినమ్రంగా పేర్కొన్నారు.
ఆయన పోస్ట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. "మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని మీరు నమ్మండి, ఆశ కోల్పోవద్దు అనే సందేశాన్ని ఇచ్చారు" అని ఒకరు కామెంట్ చేయగా, "మీ వినయం, సంస్కృతి మిమ్మల్ని ప్రత్యేకంగా మార్చాయి. మీ బయోపిక్ తీయాలి" అని మరొకరు సూచించారు. ఈ ఏడాది టైమ్ జాబితాలో భారత్ నుంచి వికాస్ ఖన్నాతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, నటుడు రణబీర్ కపూర్ కూడా స్థానం సంపాదించుకున్నారు.