బెంగళూరు బౌలర్ల ధాటికి లక్నో విలవిల... 146 ఆలౌట్
- ఆర్సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన లక్నో
- 4 వికెట్లతో చెలరేగిన రసిఖ్ సలామ్ దార్
- 3 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్
- 146 పరుగులకే ఆలౌట్ అయిన లక్నో సూపర్ జెయింట్స్
- ఆర్సీబీ ముందు 147 పరుగుల స్వల్ప లక్ష్యం
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు నిప్పులు చెరిగారు. వారి పదునైన బౌలింగ్‌కు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. యువ పేసర్ రసిఖ్ సలామ్ దార్ (4/24), అనుభవజ్ఞుడు భువనేశ్వర్ కుమార్ (3/27) లక్నో పతనాన్ని శాసించడంతో, ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి బౌలర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. లక్నో జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కెప్టెన్ రిషభ్ పంత్ (1), నికోలస్ పూరన్ (1) వంటి కీలక బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమై పెవిలియన్ చేరారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మిచెల్ మార్ష్ (40) కాసేపు పోరాడాడు. చివర్లో ఆయుష్ బదోని (38), ముకుల్ చౌదరి (39) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించే ప్రయత్నం చేశారు. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వారికి సహకారం అందలేదు.
ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ నాలుగు వికెట్లతో కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా, భువనేశ్వర్ కుమార్ కీలక సమయాల్లో మూడు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టాడు. వారికి తోడుగా జోష్ హేజిల్‌వుడ్ (1/20) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, కృనాల్ పాండ్య రెండు వికెట్లు పడగొట్టాడు. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో ఆర్సీబీ... లక్నోను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. మరికాసేపట్లో ఆర్సీబీ 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.