కాల్పుల విరమణ పొడిగింపుపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదన్న ట్రంప్
- శాశ్వత ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామన్న ట్రంప్
- ఒప్పందం కుదిరితేనే మంచిదని అభిప్రాయపడిన ట్రంప్
చర్చల ఫలితం ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే, ఇరాన్‌తో ఒప్పందం కుదిరితేనే అందరికీ మంచిదని అభిప్రాయపడ్డారు. ఒప్పందం కుదిరితే ఇరాన్ కూడా తమ దేశాన్ని పునర్నిర్మించుకోవచ్చని అన్నారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అధికారులతో అమెరికా ప్రతినిధులు మరోసారి సమావేశం కానున్నారని ట్రంప్ వెల్లడించారు. రెండో విడత చర్చలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.