ఛత్తీస్‌గఢ్‌లోని పవర్ ప్లాంట్‌లో పేలుడు... 9 మంది మృతి

Vedanta Power Plant Explosion Kills Nine in Chhattisgarh
  • శక్తి జిల్లాలోని సింగితరాయ్ గ్రామంలోని వేదాంత పవర్ ప్లాంట్‌లో ప్రమాదం
  • బాయిలర్ ట్యూబ్‌లో పేలుడు
  • 30 మందికి పైగా గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. శక్తి జిల్లాలోని సింగితరాయ్ గ్రామంలోని ఈ విద్యుత్ ప్లాంట్‌లో మధ్యాహ్నం బాయిలర్ ట్యూబ్‌లో పేలుడు సంభవించడంతో 9 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయబడినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు కార్మికులు లోపల చిక్కుకుపోయి ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈరోజు కార్మికులు పని చేస్తున్న సమయంలో బాయిలర్‌లో వైఫల్యం తలెత్తడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు.

దీనితో వెంటనే కార్మికులు ప్లాంట్ నుంచి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్లు చెప్పారు. దీనితో మరికొందరు గాయాలపాలయ్యారని వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది.
Go Back to Shorts
Vedanta Power Plant
Chhattisgarh
Power Plant Accident
Singitarai
Boiler Explosion
Industrial Accident

More Telugu News