హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం ఏప్రిల్ 13న రికార్డు స్థాయికి చేరుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైనట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. నేడు సాయంత్రం 16.01 గంటలకు జీహెచ్ఎంసీ పరిధిలో 4,381 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ వినియోగం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పుడిప్పుడే ప్రారంభమైనప్పటికీ, ఇప్పటి వరకు ఇది అత్యధికం.

గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో 2026 మార్చి 3వ తేదీన 4,421 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతూ వినియోగదారులకు అవాంతరాలు ఎదురుకాకుండా విద్యుత్ సరఫరా సాగిస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగినా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

Hyderabad Electricity Consumption
Telangana electricity
GHMC electricity demand
TGSPDCL
Hyderabad power consumption

More Telugu News