భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుంది: ప్రధాని నరేంద్రమోదీ

Narendra Modi says India to create new history with Women Reservation Bill
చట్టసభల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలో చట్టం కానుందని, తద్వారా భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ 21వ శతాబ్దంలోనే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకదానిని భారత్ తీసుకోబోతుందని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి నేడు ఢిల్లీలో నిర్వహించిన 'నారీ శక్తి వందన్ సమ్మేళన్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత అవసరమని మోదీ అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోందని తెలిపారు. ప్రతి పార్టీ దీనిని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని వ్యాఖ్యానించారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Narendra Modi
Women Reservation Bill
Nari Shakti Vandan Sammelan
Indian Parliament
Women Empowerment

More Telugu News