మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష

Andhra
Advertisement
  • 2016లో రైల్వే జోన్ కోసం చేసిన దీక్షపై నమోదైన కేసు
  • ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై విశాఖ కోర్టు తీర్పు
  • తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానన్న అమర్‌నాథ్‌
Advertisement
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు విశాఖపట్నం కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల కిందటి కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు అమర్‌నాథ్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2016 ఏప్రిల్‌లో గుడివాడ అమర్‌నాథ్‌ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు రోజుల పాటు దీక్ష కొనసాగించడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.

ఈ క్రమంలో పోలీసులు ఆయనను బలవంతంగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అప్పట్లో విశాఖ టూటౌన్‌ పోలీసులు అమర్‌నాథ్‌పై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

తాజాగా ఈ కేసుపై విచారణ పూర్తి చేసిన విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి, అమర్‌నాథ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించారు. తమ పోరాటం వల్లే విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని, కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Gudivada AmarnathGudivada Amarnath jailVisakhapatnam Railway ZoneSuicide attempt caseYSRCP leaderAndhra Pradesh politicsGVMC Gandhi statueHunger strikeRailway court verdict

More Telugu News

కరవు కష్టాల నుంచి రైతన్నను గట్టెక్కించండి: కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

04 Nov, 17:59

బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బాలీవుడ్ హీరోలకు బెదిరింపులు.. బెంగళూరు టెక్కీ అరెస్ట్

04 Nov, 17:48

"డెమొక్రాట్లతో కలిసి పనిచేస్తా".. ఎన్నికల ఫలితాలతో స్వరం మార్చిన ట్రంప్

04 Nov, 17:38

వర్షంలో విమానం ఎగరడం సురక్షితమేనా? పైలట్‌ ఏం చెప్పాడంటే..!

04 Nov, 17:25

ఉదయం 11 గంటలకే ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేది: రాహుల్ గాంధీ

04 Nov, 17:06

చెక్కుపై డబ్బు రాసిన తర్వాత చివర్లో ‘ONLY’ అని ఎందుకు రాస్తారు? దీని వెనుక అసలు కారణం ఇదే!

04 Nov, 16:55

రోహిత్ భాయ్ చేసిన ఆ రనౌటే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్: గిల్

04 Nov, 16:42

వరుసగా ఐదో రోజూ లాభాల జోరు.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

04 Nov, 16:30

అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీపైనే విమర్శలా?: నిర్మాత ఎస్కేఎన్

04 Nov, 16:27

3,800 ఏళ్ల నాటి లేఖ రహస్యం.. మట్టి కవర్‌ను తెరవకుండానే చదివిన పరిశోధకులు!

04 Nov, 16:14

ఏఐపై భారతీయుల్లో ఆశావాదం.. అమెరికన్లలో మాత్రం నిరాశ: శామ్‌ ఆల్ట్‌మన్‌

04 Nov, 16:09

వంగవీటి రాధా గెలుపు చరిత్రాత్మకం: కేశినేని చిన్ని

04 Nov, 16:04

భూమి వైపు దూసుకొస్తున్న నాసా స్పేస్‌ టెలిస్కోప్‌.. భారత్‌లోనూ శకలాలు పడే అవకాశం!

04 Nov, 16:02

గుమ్మంలో దీపం, చేతిలో లీకైన సిలిండర్.. క్షణాల్లో అంటుకున్న మంటలు.. వైరల్ వీడియో!

04 Nov, 15:55

మేయర్‌గా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు: వంగవీటి రాధా

04 Nov, 15:42
..More Telugu News