11,000 లీటర్ల పాలతో అమ్మవారికి మహాభిషేకం.. వీడియో ఇదిగో!
మధ్యప్రదేశ్లో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం చోటుచేసుకుంది. సెహోర్ జిల్లాలోని పాతాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఏకంగా 11,000 లీటర్ల పాలతో నర్మదా మాతకు భక్తులు ఘనంగా మహాభిషేకం నిర్వహించారు. పాల ట్యాంకర్ను ఉపయోగించి జరిపిన ఈ అభిషేకం, భక్తి ప్రపత్తులకు నిలువుటద్దంగా నిలిచింది.
బెరుండ ప్రాంతంలోని సత్దేవ్లో ఉన్న ఈ ఆలయంలో 21 రోజుల పాటు మహాయజ్ఞం జరిగింది. దీని ముగింపు సందర్భంగా నర్మదా మాతకు ఈ ప్రత్యేక అభిషేకం చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు మంత్రోచ్చారణల మధ్య ఈ వేడుకలో పాల్గొన్నారు. పాల ట్యాంకర్ నుంచి పాలు ప్రవహిస్తుండగా భక్తులు పూజలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మార్చి 18న ప్రారంభమైన ఈ యజ్ఞంలో ప్రతీరోజూ మహాహవనం నిర్వహించారు. ఇందుకోసం రోజూ 21 క్వింటాళ్ల చొప్పున, 21 రోజులకు గాను దాదాపు 41 టన్నుల హోమ ద్రవ్యాలను వినియోగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కొబ్బరికాయలతో పాటు బంగారం, వెండిని కూడా హోమగుండంలో సమర్పించారు.
ఈ సత్దేవ్ ప్రాంతానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పూర్వం సప్తర్షులు ఇక్కడ తపస్సు చేశారని, వారి తపస్సుకు మెచ్చి శివుడు పాతాళేశ్వర్ మహాదేవుడిగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. అహల్యాబాయి హోల్కర్ పాలనలో ఈ ఆలయానికి ప్రాధాన్యం లభించినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. సంత్ శివానంద్ మహరాజ్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా వేలాది మందికి భండారా (అన్నప్రసాద వితరణ) నిర్వహించారు.