అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన భారత్

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా పేర్కొంది.

"కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. ఇది పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి దారి తీస్తుందని ఆశిస్తున్నాం. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం దౌత్యపరమైన చర్చలు అవసరమని భారత్ మొదటి నుంచి చెబుతోంది. ఈ సంఘర్షణ ప్రపంచ దేశాలకు, ప్రజలకు ఇప్పటికే ఎంతో ఇబ్బందికర పరిణామాలను కలిగించింది" అన్నారు.

పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపించాయని పేర్కొంది. యుద్ధ విరమణ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది.

India
Iran
America
US Iran ceasefire
West Asia peace
Hormuz Strait
Indian Foreign Ministry

More Telugu News