గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు.. తెలంగాణ కేబినెట్ ఆమోదం

Revanth Reddy Telangana Cabinet Approves 1000 Crores for Godavari Pushkaralu
  • కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
  • రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ
  • తొలి విడతగా రూ.300 కోట్ల మంజూరుకు కేబినెట్ పచ్చజెండా
గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సంబంధిత పనుల కోసం నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్ల మంజూరుకు పచ్చజెండా ఊపింది.

కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, పాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసింది. కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరుకు అంగీకారం తెలిపింది.
Go Back to Shorts
Revanth Reddy
Godavari Pushkaralu
Telangana Cabinet
Telangana Government
Pushkaralu Funds

More Telugu News