పాక్ ప్రధాని ట్వీట్‌లో భారీ పొరపాటు.. అడ్డంగా దొరికిన షెహబాజ్ షరీఫ్!
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన ఆ ట్వీట్‌లో దొర్లిన ఓ చిన్న పొరపాటు, ఆ సందేశాన్ని ఆయన సొంతంగా రాయలేదని, ఎవరో రాసిస్తే కాపీ-పేస్ట్ చేశారనే ఆరోపణలకు దారితీసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు వాయిదా వేయాలని షరీఫ్ తన ఎక్స్ ఖాతాలో ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పోస్ట్ మొదట "డ్రాఫ్ట్ - పాకిస్థాన్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్" అనే వాక్యంతో కనిపించింది. కొద్దిసేపటికే దాన్ని ఎడిట్ చేసి తొలగించినప్పటికీ, అప్పటికే చాలామంది స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ వ్యవహారంపై 'ది డైలీ బీస్ట్' వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. పాక్ ప్రధాని సిబ్బంది సైతం ఆయనను 'పాకిస్థాన్ పీఎం' అని సంబోధించరని, కాబట్టి ఈ సందేశం బయటి నుంచే వచ్చి ఉండవచ్చని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్‌లో ట్రంప్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలను ట్యాగ్ చేయడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.
విశేషమేమిటంటే, షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకే ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మధ్యవర్తిగా పాకిస్థాన్ వ్యవహరిస్తున్న కీలక సమయంలో ఈ వివాదం తలెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పొరపాటును గుర్తించిన తర్వాత షరీఫ్ కార్యాలయం 'డ్రాఫ్ట్' పదాన్ని తొలగించి, తుది సందేశాన్ని పోస్ట్ చేసింది. అందులో దౌత్యానికి అవకాశం ఇవ్వాలని, సద్భావన చర్యగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్‌ను కోరారు. అయితే, ఈ గందరగోళంపై పాక్ ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.