41,000 అడుగుల ఎత్తులో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన!
గాల్లో ప్రయాణిస్తున్న విమానానికి ఉన్నట్లుండి రెండు ఇంజిన్లు ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికే భయంకరంగా ఉన్న ఈ ఘటన 1983 జులై 23న ఎయిర్ కెనడా విమానంలో నిజంగా జరిగింది. ఇంధనం పూర్తిగా అయిపోయి, 41,000 అడుగుల ఎత్తులో శక్తిని కోల్పోయిన ఆ విమానం.. ఒక పెద్ద గ్లైడర్‌గా మారి, పైలట్ల అసాధారణ నైపుణ్యంతో సురక్షితంగా నేల మీదకు దిగింది. "గిమ్లీ గ్లైడర్"గా చరిత్రలో నిలిచిపోయిన ఈ ఘటన విమానయాన రంగంలో ఒక అద్భుతం.
ఒక్క లెక్క తప్పడంతో..
ఈ పెను ప్రమాదానికి బీజం నేల మీదే పడింది. మాంట్రియల్ నుంచి ఎడ్మంటన్‌కు బయలుదేరిన ఎయిర్ కెనడా ఫ్లైట్ 143లో ఫ్యూయల్ ఇండికేషన్ సిస్టమ్ పనిచేయడం లేదు. దీంతో, ట్యాంకుల్లో ఎంత ఇంధనం ఉందో సిబ్బంది చేతితో కొలిచి లెక్కించాల్సి వచ్చింది. అదే సమయంలో కెనడాలో ఇంపీరియల్ (పౌండ్లు) నుంచి మెట్రిక్ (కిలోగ్రాములు) విధానానికి మారుతున్నారు. విమానానికి కిలోగ్రాముల్లో ఇంధనం అవసరం కాగా, సిబ్బంది పొరపాటున పౌండ్లకు సంబంధించిన కన్వర్షన్ ఫ్యాక్టర్‌ను ఉపయోగించారు. దీంతో అవసరమైన దానిలో సగం కన్నా తక్కువ ఇంధనంతోనే విమానం టేకాఫ్ అయింది.
ఆకాశంలో ఆగిన ఇంజిన్లు
విమానం 41,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో అలారాలు మోగడం మొదలైంది. మొదట ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్ పంప్ ఫెయిల్ అయిందని పైలట్లు భావించారు. కానీ కాసేపటికే మొదటి ఇంజిన్, ఆ వెంటనే రెండో ఇంజిన్ కూడా పూర్తిగా ఆగిపోయింది. దీంతో విమానానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి కాక్‌పిట్ స్క్రీన్లు చీకటిగా మారాయి. కేవలం "రామ్ ఎయిర్ టర్బైన్" అనే ఒక చిన్న అత్యవసర పరికరం ద్వారా ఉత్పత్తి అయిన పరిమిత శక్తితో హైడ్రాలిక్స్‌ను నియంత్రిస్తూ విమానాన్ని అదుపు చేయగలిగారు.
పైలట్ చాకచక్యం.. రేస్‌ట్రాక్‌పై ల్యాండింగ్
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ రాబర్ట్ పియర్సన్‌కు గ్లైడర్ పైలట్‌గా ఉన్న అపార అనుభవం ప్రాణాలు కాపాడింది. ఇంజిన్లు లేని విమానాన్ని ఒక గ్లైడర్‌లా భావించి, గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవసరమైన సరైన వేగాన్ని (సుమారు 220 నాట్స్) అందుకున్నారు. మొదట విన్నిపెగ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వాలనుకున్నా, దూరం సరిపోదని గ్రహించారు. ఫస్ట్ ఆఫీసర్ మారిస్ క్వింటాల్ సూచన మేరకు, సమీపంలోని గిమ్లీ అనే పాత ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.
అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.. ఆ రన్‌వే అప్పటికే రేస్‌ట్రాక్‌గా మారిపోయి కార్లు, టెంట్లు, ప్రేక్షకులతో నిండి ఉంది. విమానం ఎత్తుగా, వేగంగా ఉండటంతో ల్యాండింగ్ కష్టమని భావించిన కెప్టెన్.. సాధారణంగా చిన్న విమానాల్లో వాడే "ఫార్వర్డ్ స్లిప్" అనే సాహసోపేత విన్యాసం చేసి విమానం ఎత్తును వేగంగా తగ్గించారు. ఇంజిన్ల శబ్దం లేకపోవడంతో నిశ్శబ్దంగా వచ్చిన విమానం రన్‌వేపై బలంగా ల్యాండ్ అయింది. టైర్లు పేలి, ముందు చక్రం విరిగిపోయినా.. విమానం ప్రేక్షకులకు కేవలం 100 అడుగుల దూరంలో సురక్షితంగా ఆగింది. ఈ ఘటనలో విమానంలోని 61 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందిలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు.
తదనంతర విచారణలో ఇది కేవలం సిబ్బంది పొరపాటు మాత్రమే కాదని, మెట్రిక్ విధానంపై సరైన శిక్షణ లేకపోవడం, వ్యవస్థల వైఫల్యం కూడా కారణమని తేలింది. మొదట క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నప్పటికీ, కెప్టెన్ పియర్సన్, ఫస్ట్ ఆఫీసర్ క్వింటాల్‌లను వారి అసాధారణ నైపుణ్యానికి గాను 1985లో సత్కరించారు. ఆ విమానం మరమ్మతుల తర్వాత మరో 25 ఏళ్ల పాటు సేవలు అందించి 2008లో నిలిపివేయబడింది.