'పంజా' నుంచే శేష్ ను గమనిస్తున్నా: వెంకటేశ్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘డెకాయిట్’. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేశ్, చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ, అడివి శేష్‌ను తాను ‘పంజా’ సినిమా సమయం నుంచే గమనిస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పంజాలో శేష్‌ను చూసినప్పుడే అతను భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడని నాకు అనిపించింది. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది" అని వెంకటేశ్ అన్నారు. ‘డెకాయిట్’ కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ, ఆమె ముఖంలో అద్భుతమైన హావభావాలు పండుతాయని, ఆమె నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కొనియాడారు. ఎంతో ప్యాషన్‌తో, క్రమశిక్షణతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సుప్రియ యార్లగడ్డను వెంకటేశ్ ప్రత్యేకంగా అభినందించారు. తాను ఈ వేడుకకు సుప్రియతో పాటు తనకు ఇష్టమైన సురేంద్ర మామయ్య కోసం వచ్చానని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.