ధురంధర్ 2పై కోహ్లీ రివ్యూ.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలేదంటూ ప్రశంసలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధురంధర్ 2పై కోహ్లీ రివ్యూ.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలేదంటూ ప్రశంసలు!

Virat Kohli Reviews Dhurandhar 2 Praises Movie
  • 'ధురంధర్ 2' చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన విరాట్ కోహ్లీ
  • ఇది ఇండియాలో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అని ప్రశంస
  • ప్రపంచవ్యాప్తంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా
  • చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన నటి అనుష్క శర్మ
  • బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న రణ్‌వీర్ సింగ్ చిత్రం
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ధురంధర్ 2'పై ప్రశంసల వర్షం కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, భారతదేశంలో ఇంతటి అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు.  

"ఈ రోజు సినిమా చూశాను. ఇండియాలో ఇలాంటి సినిమాటిక్ అనుభవాన్ని నేనెప్పుడూ చూడలేదని ధైర్యంగా చెప్పగలను. దాదాపు 4 గంటల పాటు ఒక్క క్షణం కూడా కనురెప్ప వాల్చకుండా చూశాను. దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభ, నమ్మకం ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. మీకు నా హ్యాట్సాఫ్. మీరు ఒక జీనియస్. నటీనటులందరూ అద్భుతంగా చేసినా, రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాతో మరో స్థాయికి చేరుకున్నాడు. ఆయన నటన అద్భుతం" అని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.

కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించింది. దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ, సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని పేర్కొంటూ, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను, రణ్‌వీర్ సింగ్ నటనను ఆమె కొనియాడింది.

వసూళ్ల విషయానికొస్తే, 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జియో స్టూడియోస్ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దేశీయంగా రూ. 1041 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. యాక్షన్, జాతీయవాదం వంటి అంశాలతో రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  
Advertisement
Virat Kohli
Dhurandhar 2
Ranveer Singh
Aditya Dhar
Anushka Sharma
Bollywood movie
Indian cinema
Box office collection
Movie review
Action movie

More Telugu News