Sangeeth Shobhan: ‘రాకాస’కు అదిరిపోయే వసూళ్లు.. రెండు రోజుల్లో రూ.10 కోట్లు దాటిన గ్రాస్

Sangeeth Shobhan Rakasa Film Earns 103 Crores Worldwide
షార్ట్స్‌లో చూడండి
యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'రాకాస' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 10.30 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల 3న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. వీకెండ్ కూడా కలిసి రావడంతో రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.

సినిమాకు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తూ 'బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్' నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. “ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా 'రాకాస'ని చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు” అని తెలిపారు.

మెగా డాటర్ నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయమయ్యారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.
Go Back to Shorts
Sangeeth Shobhan
Rakasa Movie
Nayan Sarika
Telugu Horror Comedy
Box Office Collections
Niharika Konidela
Manasa Sharma
Pink Elephant Pictures
Getup Srinu
Brahmaji

More Telugu News