Abhishek Sharma: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న సన్ రైజర్స్ క్రికెటర్లు

ఐపీఎల్ టోర్నమెంట్‌లో తమ సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టు ఆటగాళ్లు హైదరాబాద్ జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. జట్టు ఆల్‌రౌండర్లు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి నిన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోల్‌కతా నుంచి నగరానికి చేరుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు నేరుగా ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి, శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. గత సీజన్‌లో అద్భుతంగా ఆడిన అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి ఈసారి ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపథ్యంలో, కీలకమైన మ్యాచ్‌కు ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం, ఏప్రిల్ 6న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని జట్టు భావిస్తోంది.
Abhishek Sharma
Sunrisers Hyderabad
SRH
Nitish Kumar Reddy
Jubilee Hills Peddamma Temple
IPL 2024
Indian Premier League
Gujarat Titans
Rajiv Gandhi International Stadium
Hyderabad

More Telugu News