KGBV: తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలు.. ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్!
పేద, మధ్యతరగతి విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ గౌడ్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది నుంచి కేజీబీవీలను ‘యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్’ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో ఇంటర్ విద్యతో పాటు ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కూడా నిపుణులతో ఉచితంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
ఆసక్తిగల విద్యార్థినులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో tgrjc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్, ఐనవోలు, ధర్మసాగర్ కేజీబీవీలను ఎక్సలెన్స్ సెంటర్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఈ విద్యాలయాల్లో చేరిన విద్యార్థినులకు ఉచిత విద్య, హాస్టల్ వసతి, లైబ్రరీ సౌకర్యాలతో పాటు మానసిక వికాసానికి సైకాలజీ క్లాసులు నిర్వహిస్తారు. క్రీడలు, యోగా, ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ ఇస్తారు. మరిన్ని వివరాలకు 040-24734899 లేదా 18004252428 నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.