Jos Buttler: నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు అతనే.. దశాబ్దం పాటు క్రికెట్‌ను శాసిస్తాడు: వైభవ్‌ను ఆకాశానికెత్తేసిన బట్లర్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే దశాబ్ద కాలం పాటు వైభవ్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని, భవిష్యత్తులో ప్రపంచం అతని పాదాక్రాంతమవుతుందని జోస్యం చెప్పాడు. 15 ఏళ్ల ఈ యువ కెరటం ఆటతీరుకు తాను ముగ్ధుడనయ్యానని బట్లర్ పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌తో కలిసి వైభవ్‌తో సరదాగా మాట్లాడిన సందర్భంగా బట్లర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో బట్లర్ మాట్లాడుతూ.. "నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు. అతనికి 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం అతని పాదాల చెంత ఉంటుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మీరు మా ఇంగ్లండ్ జట్టు హృదయాలను ముక్కలు చేశారు" అని హరారేలో వైభవ్ ఆడిన 80 బంతుల్లో 175 పరుగుల రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు. బట్లర్ ప్రశంసలకు వైభవ్ చిరునవ్వుతో బదులివ్వగా, ఇద్దరూ ఆప్యాయంగా కరచాలనం చేసుకున్నారు.
వైభవ్‌కు బట్లర్ కొన్ని విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. "చాలా అద్భుతంగా ఆడుతున్నావు. నీ ఆట చూడటానికి ఎంతో బాగుంది. ఇదే స్వేచ్ఛతో, కష్టపడి ఆడటం కొనసాగించు" అని ప్రోత్సహించాడు. ఈ సందర్భంగా టీమ్ మేనేజర్ మాట్లాడుతూ.. బట్లర్లాగే తాను కూడా ఎన్నో ట్రోఫీలు గెలవాలని వైభవ్ ఒకసారి తనతో చెప్పినట్లు వెల్లడించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బట్లర్ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 122 మ్యాచ్‌లు ఆడిన బట్లర్, దాదాపు 40 సగటుతో, 149 స్ట్రైక్ రేట్‌తో 4,158 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒక సీనియర్, స్టార్ ప్లేయర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు యువ వైభవ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు