LPG Crisis: 24 గంటల్లో డెలివరీ నుంచి 25 రోజుల దాకా.. దేశంలో ఎల్‌పీజీ సంక్షోభం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయ వంటగ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుమతులు మందగించడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎల్‌పీజీ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. బుక్ చేసినా సిలిండర్ చేతికి అందడానికి వారాల సమయం పడుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి వద్దకే డెలివరీ సంగతి అటుంచి గ్యాస్ గోడౌన్ల వద్ద భారీ క్యూలో గంటల తరబడి వేచి ఉన్నా సిలిండర్ దొరుకుతుందనే నమ్మకం లేదని జనం వాపోతున్నారు.
భారత్ తన గ్యాస్ అవసరాల కోసం అధికంగా ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలపై ఆధారపడుతోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సముద్ర రవాణా మార్గాలకు అంతరాయం కలగడం, బీమా ఖర్చులు పెరగడంతో ఎల్‌పీజీ దిగుమతులు నెమ్మదించాయి. ఫలితంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. గతంలో బుక్ చేసిన 24 గంటల్లోనే వచ్చే సిలిండర్, ఇప్పుడు 20 నుంచి 25 రోజులకు కూడా రావడంలేదని ప్రజలు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీలు కొత్త బుకింగ్‌లను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఈ కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా జోరందుకుంది. సాధారణ ధర కంటే రూ.300 నుంచి రూ.500 వరకు అదనంగా వసూలు చేసి అక్రమంగా సిలిండర్లను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్, యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు గ్యాస్ కొరతతో మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నాయి.
ఈ కొరత తాత్కాలికమేనని, సరఫరాను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే, యుద్ధం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.