నాసిక్‌లో విషాదం.. కారు బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Car accident in Nashik 9 family members dead
  • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం
  • ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన
  • పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు 
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న వారంతా మృతి చెందారు.  

దిండోరి తాలూకాకు చెందిన దర్గోడే కుటుంబం శివాజీనగర్‌లోని రాజే బాంక్వెట్ హాల్‌లో జరిగిన 'వడ్జే క్లాసెస్' సమావేశానికి హాజరైంది. శుక్రవారం రాత్రి కార్యక్రమం ముగించుకుని మారుతి ఎక్స్ఎల్ కారులో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన నీటితో నిండి ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే తహసీల్దార్ ముకేశ్ కాంబ్లే, పోలీస్ ఇన్‌స్పెక్టర్ భగవాన్ మధురే, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బావి నీటితో నిండి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రెండు క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి సమయంలో కారును బయటకు తీశారు.

ఈ ఆపరేషన్‌లో 8 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఓ బాలిక కోసం ప్రత్యేకంగా గాలించగా, ఆమె మృతదేహం కూడా లభ్యమైంది. మృతులను సునీల్ దత్తాత్రేయ దర్గోడే (32), రేష్మ సునీల్ దర్గోడే (27), రాఖీ (10), మాధురి అనిల్ దర్గోడే (13), శ్రావణి అనిల్ దర్గోడే (11), ఆశా అనిల్ దర్గోడే (32), శ్రేయాష్ అనిల్ దర్గోడే (11), సృష్టి అనిల్ దర్గోడే (14), సమృద్ధి రాజేష్ దర్గోడే (7)గా గుర్తించారు. ఈ ఘటనపై దిండోరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Dargode family
Nashik car accident
Maharashtra tragedy
Dindori car accident
Road accident India
Car fell into well
উদ্ধার অভিযান
উদ্ধার অভিযান
Fatal car accident Nashik
উদ্ধার অভিযান

More Telugu News