JD Vance: అమెరికా 'ఫ్రాడ్ జార్'గా జేడీ వాన్స్ నియామకం
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఆయనను ఫ్రాడ్ జార్‌గా నియమించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో జరుగుతున్న నిధుల దుర్వినియోగం, మోసాలపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు వాన్స్ నాయకత్వం వహిస్తారని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ప్రకటించారు.
ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా జరిగినప్పటికీ, ప్రధానంగా డెమొక్రాటిక్ పార్టీ పాలనలో ఉన్న కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, న్యూయార్క్ వంటి రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ‘ఈ మోసాల విలువ చాలా పెద్దది. దాన్ని విజయవంతంగా అరికట్టగలిగితే అమెరికా బడ్జెట్‌ను కూడా బ్యాలెన్స్ చేయవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నియామకం మార్చి 2026లో జారీ చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అమల్లోకి వచ్చింది.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే లాస్ ఏంజెలెస్‌లో దాడులు ప్రారంభమైనట్లు ట్రంప్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మోసం చేసేందుకు ప్రయత్నించిన ఎనిమిది మందిపై ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సుమారు రూ.50 మిలియన్ల మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి.
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది అవినీతిపై పోరాటం కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారని డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ (డీఎన్సీ) చైర్ కెన్ మార్టిన్ గతంలోనే ఆరోపించారు. ఈ నియామకం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.