Aadi Saikumar: ఆది సాయికుమార్ కొత్త చిత్రం... 'సైరాభాను'

Aadi Saikumars Next Film Sairabanu Launched
షార్ట్స్‌లో చూడండి
యంగ్ హీరో ఆది సాయికుమార్ తన కొత్త సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ''సైరాబాను' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.

ఇటీవలే 'కె-ర్యాంప్' చిత్రంతో సంచలన విజయం అందుకున్న ప్రముఖ నిర్మాత రాజేష్ దండా తన హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆది సాయికుమార్ సరసన బాంధవి శ్రీధర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. గులాబీ రంగు మేఘం, దాని కింద 'ప్రేమ, విశ్వాసం, విధికి సంబంధించిన ఒక సరదా ప్రయాణం' అనే ట్యాగ్‌లైన్‌తో రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఇది ఒక హిందూ-ముస్లిం ప్రేమకథ అని, వినోదభరితంగా సాగుతుందని తెలుస్తోంది. రాజమండ్రి, హైదరాబాద్ నగరాల నేపథ్యంలో కథ నడుస్తుంది. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిరణ్ అబ్బవరం, రామ్ అబ్బరాజు, కోన వెంకట్ తదితరులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

'శంబాల'తో కెరీర్‌లో మంచి హిట్ అందుకున్న ఆది సాయికుమార్, ప్రస్తుతం కథాబలం ఉన్న కమర్షియల్ చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Go Back to Shorts
Aadi Saikumar
Sairabanu
Telugu Movie
Phani Krishna Siriki
Rajesh Danda
Bandhavi Sridhar
Romantic Comedy
Hindu Muslim Love Story
Telugu Cinema 2024
Sekhar Chandra

More Telugu News