Rohit Sharma: రోహిత్ శర్మ, కోహ్లీల భవిష్యత్తుపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Yuvraj Singh Comments on Rohit Sharma Kohli Future
షార్ట్స్‌లో చూడండి
భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, వారిద్దరి విషయంలో మరింత స్పష్టత అవసరమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20 ఫార్మాట్లకు దూరంగా ఉంటున్నా, 50 ఓవర్ల జట్టులో కొనసాగుతున్నారు.

ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ, "వారి మనసులో ఏముందో నాకు తెలియదు. వరల్డ్ కప్ ఆడాలని వారు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే తుది నిర్ణయం సెలక్టర్లదే" అని యువరాజ్ చెప్పాడు. ఆటగాళ్లతో మేనేజ్ మెంట్ కూర్చుని బహిరంగంగా చర్చించాలని, ఇలాంటి సంభాషణలు కష్టమైనప్పటికీ జట్టు భవిష్యత్తుకు అవసరమని సూచించాడు. "భారత క్రికెట్‌లో ముఖం మీదే నిజం చెప్పే సంస్కృతి లేదు. కానీ ఏడాది తర్వాతైనా, నిజం చెప్పినందుకు ఆటగాళ్లు సంతోషిస్తారు" అని యువీ పేర్కొన్నాడు.

ప్రస్తుతం కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరగా, రోహిత్ కూడా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్న 2027 ప్రపంచకప్ కోసం భారత జట్టు సన్నాహాలు మొదలుపెట్టిన తరుణంలో యువరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Go Back to Shorts
Rohit Sharma
Virat Kohli
Yuvraj Singh
Indian Cricket
ODI World Cup 2027
Team India
Cricket News
BCCI
Indian Cricket Team
Selection Committee

More Telugu News