స్పేస్ ఎక్స్ 'ఫాల్కన్9'కు పోటీగా చైనా భారీ రాకెట్ ప్రయోగం... విఫలం

స్పేస్ ఎక్స్ 'ఫాల్కన్9'కు పోటీగా చైనా భారీ రాకెట్ ప్రయోగం... విఫలం

China Rocket Launch Fails SpaceX Falcon 9 Rival
  • వాణిజ్య అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో చైనాకు గట్టి ఎదురుదెబ్బ
  • ప్రైవేటుగా అభివృద్ధి చేసిన తియాన్‌లాంగ్3 ప్రయోగం
  • సాంకేతిక లోపం కారణంగా నింగిలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాల్లో విఫలం
చైనా సొంతంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగం విఫలమైంది. దీనితో వాణిజ్య అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేటుగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన తియాన్‌లాంగ్-3 ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. ఇది నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లలేకపోయినట్లు సంబంధిత సంస్థ తెలిపింది.

బీజింగ్‌కు చెందిన స్పేస్ పయనీర్ అనే ప్రైవేటు సంస్థ 'స్పేస్ ఎక్స్' ఫాల్కన్9కు పోటీగా ఈ భారీ రాకెట్‌ను అభివద్ధి చేసింది. దీనిని ఈరోజు డాంగ్‌ఫెంగ్ కమర్షియల్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ కేంద్రం నుంచి ప్రయోగించగా, నింగిలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాల్లోనే విఫలమైంది. ఇది ఫెయిల్ కావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పేస్ పయనీర్ వెల్లడించింది. తదుపరి మిషన్ విజయవంతమయ్యేలా కృషి చేస్తామని తెలిపింది.
Advertisement
China Rocket
Tianlong-3
Space Pioneer
Falcon 9
SpaceX
Rocket Launch Failure
Commercial Space Research

More Telugu News