Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి.. కుమార్తె వివాహ వేడుకలు ప్రారంభం!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని బండ్ల త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ శుభకార్యానికి ముందు సంప్రదాయం ప్రకారం ఇంట్లో ‘పసుపు కుంకుమ’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విషయాన్ని బండ్ల గణేశ్ స్వయంగా తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
సూర్యతేజ చిలుకూరితో జనని వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఆయన భావోద్వేగంగా పోస్ట్ చేశారు. "శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేశ్ సంతోషం ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.