Amaravati: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వాకౌట్ చేసిన వైసీపీ

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపింది.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చను ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు.

రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందని అన్నారు. కాగా, రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారనుంది. సభలో 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. పది పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతిచ్చారు.
Amaravati
Andhra Pradesh
Rajya Sabha
Nityananda Rai
Renuka Chowdhury
AP Reorganisation Act

More Telugu News