Nara Lokesh: నేడు ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా లోకేశ్ కలవనున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులతోనూ ఆయన సమావేశమవుతారు. అలాగే, రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కూడా మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని లోకేశ్ రాజ్యసభ గ్యాలరీ నుంచి లోకేశ్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.