Donald Trump: ఒబామా హయాంలో ఇరాన్‌తో ఒప్పందం పెద్ద పొరపాటు.. ఆ తప్పును నేను సరిదిద్దా: ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో ఒబామా పెద్ద తప్పు చేశారని, దానిని తన హయాంలో సరిదిద్దడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన, ఒబామా హయాంలో ఇరాన్‌తో జరిగిన అణు ఒప్పందాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేశారు.

ఆ ఒప్పందం తర్వాత ఇరాన్ మనల్ని చూసి నవ్విందని, అయినా మనం డబ్బుతో వారి గౌరవాన్ని కొనాలని చూశామని ట్రంప్ ఆరోపించారు. "ఇతర అధ్యక్షులు చేయడానికి సాహసించని పనిని నేను చేశాను. వారు చేసిన తప్పులను నేను సరిదిద్దుతున్నాను" అని ఆయన పేర్కొన్నారు. తాను ప్రచారం ప్రారంభించిన తొలి రోజు నుంచే ఇరాన్‌ను ఎప్పటికీ అణ్వస్త్ర శక్తిగా మారనీయనని శపథం చేశానని గుర్తుచేశారు.

2015లో ఒబామా హయాంలో అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందం (JCPOA) కుదుర్చుకున్నాయి. అయితే, ఈ ఒప్పందం ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని నిలువరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ 2018లో ట్రంప్ దీని నుంచి వైదొలిగారు. "గత 47 ఏళ్లుగా ఆ మతోన్మాద పాలన 'డెత్ టు అమెరికా' అని నినదిస్తోంది. నేను అధికారంలోకి రాకముందే ఈ సమస్యను పరిష్కరించాల్సింది" అని అన్నారు.

ఇదే సమయంలో 2020లో తన ఆదేశాలతో జరిగిన ఖాసిం సులేమానీ హత్యను ట్రంప్ సమర్థించుకున్నారు. "సులేమానీ ఒక దుష్ట మేధావి. తెలివైనవాడే కానీ భయంకరుడు. అతడిని అంతమొందించడం ఒక పెద్ద విజయం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


Donald Trump
Barack Obama
Iran nuclear deal
JCPOA
Qassem Soleimani
Iran
US foreign policy
Trump Iran policy
Death to America
Iran missile program

More Telugu News