Fly91 Airlines: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!

Vijayawada Hyderabad New Flight Services Announced by Fly91
షార్ట్స్‌లో చూడండి
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య విమానయాన సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఫ్లై-91 ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ సర్వీసులను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు.

మొదటి సర్వీసు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విమానం ప్రతిరోజూ ఉదయం 6:05 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 7:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి విజయవాడ నుంచి ఉదయం 7:30 గంటలకు బయలుదేరి 8:40 గంటలకు హైదరాబాద్‌లో దిగుతుంది. ఇక, రెండో సర్వీసు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ విమానం ఉదయం 10:10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 11:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని డైరెక్టర్ వివరించారు.

ఈ కొత్త సర్వీసుల్లో ప్రయాణ చార్జీలు రూ.4,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటాయ‌ని లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉడాన్ పథకం ద్వారా ప్రధాన నగరాల మధ్య విమానయాన అనుసంధానం పెరుగుతోందని, దీనిలో భాగంగానే రాష్ట్రంలోని కడప, కర్నూలు విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
Fly91 Airlines
Vijayawada
Hyderabad
Flights
Aviation Services
UDAN Scheme
Kadapa Airport
Kurnool Airport
Andhra Pradesh
Lakshmikantha Reddy

More Telugu News