Lucknow Super Giants: వణికించిన ఢిల్లీ బౌలర్లు... కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నో బ్యాటర్లలో అబ్దుల్ సమద్ (36) మినహా మిగతా వారెవరూ రాణించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, టి. నటరాజన్ చెరో మూడు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించారు.
లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం సరైనదేనని ఢిల్లీ బౌలర్లు ఆరంభం నుంచే నిరూపించారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే రిషబ్ పంత్ (7) అనవసర పరుగుకు యత్నించి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్ (11) ఒక సిక్స్, ఫోర్‌తో దూకుడుగా కనిపించినా, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ వెంటనే ఆయుష్ బదోని (0) డకౌట్ కావడంతో లక్నో 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులో ఉన్న మిచెల్ మార్ష్ (35), నికోలస్ పూరన్ (8) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, పూరన్‌ను ఎంగిడి బౌల్డ్ చేయగా, దూకుడుగా ఆడుతున్న మార్ష్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ పంపాడు. దీంతో లక్నో 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. ముకుల్ చౌదరి (14), షాబాజ్ అహ్మద్ (15 నాటౌట్)తో కలిసి జట్టు స్కోరును 140 మార్కు దాటించాడు.
అయితే, చివరి ఓవర్లలో నటరాజన్, ఎంగిడి వరుసగా వికెట్లు తీయడంతో లక్నో ఇన్నింగ్స్ 141 పరుగుల వద్ద ముగిసింది. ఢిల్లీ బౌలర్లలో ఎంగిడి (3/27), నటరాజన్ (3/29) అద్భుతంగా రాణించగా, కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.