KTR: కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ

కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ రాశారు. కేటీఆర్ రాసిన లేఖను బీఆర్ఎస్ ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్రమంత్రికి అందించింది. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్‌పై పనిభారం విపరీతంగా పెరిగిందని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ ట్రాక్ పరిధి 2,755 కిలోమీటర్లుగా ఉందని, మున్ముందు వాడి-రాయచూర్, విష్ణుపురం-బీబీనగర్ డబ్లింగ్ పనులు పూర్తయితే ఈ ట్రాక్ పరిధి 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని తెలిపారు. భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకారం ఒక డివిజన్‌కు ఉండాల్సిన పరిమితి కంటే ఇది ఎక్కువ అన్నారు.

ఎక్కువ కిలోమీటర్లు, పనిభారం కారణంగా సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ క్లిష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. కాజీపేట కేంద్రంగా డివిజన్‌ను ఏర్పాటు చేస్తే పరిపాలనా సులువు అవుతుందని అన్నారు. పరిపాలనా సౌలభ్యం, కార్యకలాపాల రీత్యా కాజీపేట డివిజన్ అత్యవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు.
KTR
Kazipet Railway Division
Ashwini Vaishnaw
South Central Railway
Secunderabad Division

More Telugu News