మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Silver Prices Surge Amid West Asia Tension Signs
  • రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలు పలికిన వెండి
  • రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షలు పలికిన 24 క్యారెట్ల పసిడి
  • రూ.1.51 లక్షలు పలికిన 22 క్యారెట్ల పసిడి
బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాల నేపథ్యంలో, ఖరీదైన లోహాల ధరలు పెరుగుతున్నాయి. మహావీర్ జయంతి సందర్బంగా నిన్న బులియన్ మార్కెట్‌కు సెలవు రోజు. కిలో వెండి ధర సోమవారం నాటి ముగింపు రూ.2.37 లక్షలతో పోలిస్తే రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలకు చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర మొన్నటితో పోలిస్తే రూ.3,500 పెరిగినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఈరోజు రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.51 లక్షలు పలుకుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే సంకేతాలకు తోడు, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు బంగారం, వెండి ధరల భారీ పెరుగుదలకు కారణమైంది.

ఇదిలా ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం ధర ఏకంగా 61 శాతం పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ 1న 10 గ్రాముల బంగారం ధర రూ.94,150గా ఉండగా ఇప్పుడు రూ.1,51,000 దాటింది. ఏడాది కాలంలో బంగారం రూ.57 వేలకు పైగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం ఒకానొక సమయంలో రూ.1,70,000 దాటింది. కిలో వెండి ధర గత ఏడాది ఏప్రిల్ 1న రూ.1.34 లక్షలుగా ఉండగా, ఏడాది కాలంలో రూ.1 లక్షకు పైగా పెరిగింది. ఒకానొక సమయంలో వెండి కిలో రూ.4 లక్షలు దాటింది.
Advertisement
Gold Price
Silver Price
Gold rate today
Silver rate today
Bullion market
Commodity market
West Asia tensions

More Telugu News